TS SSC Exams : మద్యం కిక్కులోనే పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడొక విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువు.. అంతేకాకుండా తాను ఇప్పుడు విద్యార్థులకు భవిష్యత్తుకు పునాదైని పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఏకంగా అదే ఎగ్జామ్ సెంటర్‌కి పూటుగా మద్యం తాగి వచ్చి తూలుతూ తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించాడు. హుజురాబాద్ లోని రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల పీఈటీ టీచర్ ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం వచ్చింది. తన ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా అనిపించింది.
ఇదే విషయంపై ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావుకి కూడా అనుమానం వచ్చింది. దీంతో సదరు టీచర్‌ను ప్రశ్నించగా గుప్పున వాసన గుబాలించడంతో.. ఇక వెంటనే స్థానిక పోలీసులను పిలిపించి సదరు టీచర్ కి ఎగ్జామ్స్ సెంటర్ లోనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. మామూలుగా 30 ఉండాల్సిన మద్యం స్థాయిలు ఏకంగా 112 చూపించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు వెంటనే రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
మరోవైపు, ఇదే అంశంపై జిల్లా విద్యాధికారి సీహెచ్‌వీఎం జనార్దన్ రావు మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరిండెంట్ ని సైతం నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!