Andhra Pradesh: శ్రీకాకుళంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జోరుగా జరిగాయి. ఈ సందర్భంగా టెక్కలిలోని వెంకటేశ్వర కాలనీలోని ఆయన ఇంటి ఆవరణలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళా డ్యాన్సర్లతో ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో పోలీస్ శాఖకు చెందిన పలువురు కూడా పాల్గొన్నారు. డ్యాన్సర్లతో పాటు వాళ్లు కూడా డ్యాన్యులు చేసి హోరెత్తించారు. టెక్కలి ఎస్సై హరికృష్ణ స్టేజీపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. మహిళా డ్యాన్సర్లతో కలిసి సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. దీంతో టెక్కలి ఎస్సై డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: Bandi Sanjay, K Laxman Live: మునుగోడులో టీఆర్ఎస్ విజయంపై రియాక్షన్
అయితే యువతులతో కలిసి టెక్కలి ఎస్సై హరికృష్ణ అశ్లీల నృత్యాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాలను ఆపాల్సిన ఎస్సై.. వారితో కలిసి డ్యాన్స్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఈ అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి టెక్కలి ఎస్సై హరికృష్ణపై వేటు వేశారు. ఎస్సై హరికృష్ణను వీఆర్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టెక్కలి ఇంఛార్జ్ ఎస్సైగా నౌపడ ఎస్సై మహమ్మద్ అలీకి బాధ్యతలు అప్పగించారు.
Read Also: Ashu Reddy: ఛీఛీ.. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా..