Police Statement: పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి రెక్కీ చేయలేదు… కుట్ర జరగలేదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Statement: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రెక్కీ నిర్వహించారన్న వార్త కలకలం సృష్టించింది. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ రెక్కీ వివాదంపై దర్యాప్తు జరపాలని.. ఒకవేళ తెలుగు రాష్ట్రాల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం బరిలోకి దిగి విచారణ చేయిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తాజాగా ఈ అంశంపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ లేదా దాడికి కుట్ర జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి ముందు న్యూసెన్స్ చేసింది ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు.
Read Also: YSRCP Leaders: పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు
Also Read
పబ్‌కు వెళ్లి తప్పతాగి తిరిగి వస్తుండగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు కారు ఆపారని.. కారు తీయమని అడిగిన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో యువకులు గొడవ పడ్డారని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువకులను విచారించి నోటీసులు జారీ చేశారు. తాగిన మైకంలోనే పవన్ ఇంటి ముందు న్యూసెన్స్ చేసినట్లు యువకులు అంగీకరించారు. కాగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆపిన కారు గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో ఉందని తెలిపారు. ఈ కారు సాయికృష్ణ అనే యువకుడికి చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ఉన్న తబ్లా రసా పబ్‌ను జనసేన కార్యకర్తలు ముట్టడించారు. నివాస ప్రాంతంలో ఉన్న ఈ పబ్‌ను మరోచోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యకర్తలు పబ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?