సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన తన కూతురిని అక్కడే ఓ దుండగుడు వేధింపులకు గురిచేశాడని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Thummala Nageswara Rao: అకాల వర్షాలతో పంట నష్టం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..
దాదాపు అరగంట పాటు బాలికను లైంగికంగా వేధించడంతో పాటు, తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు కూడా రికార్డు చేసినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్పగా, వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని అతని ఫోన్లో ఉన్న వీడియోలను పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు… పోలీసులు పీఓసీఎసో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం జరగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
READ MORE: Mollywood : మెగాస్టార్ కు పోటీగా యంగ్ హీరో సినిమా రిలీజ్