ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాకు ఇంతటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సామ్, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న విషయం విదితమే .. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు పెట్స్ అంటే పంచప్రాణాలు. తన దగ్గర ఉన్న కుక్క పిల్లలు హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. వాటికి ఏమైనా అయినా అల్లాడిపోతోంది. వాటిని బిడ్డలు కంటే ఎక్కువగా పెంచుకుంటుంది సామ్.. ఇక…
భర్త అంటే భరించేవాడు అంటారు కొందరు.. భర్త అంటే బాధ పెట్టేవాడు అంటారు మరికొందరు.. అయితే ఏది చెప్పినా భార్యాభర్తల మధ్య అనుబంధం పాలునీళ్ళులా ఉండాలంటారు పెద్దలు.. కానీ ప్రస్తుతం కాలంలో భర్తలు సైకోలు గా కాదు కాదు.. అంతకంటే ఎక్కువగా భార్యలను హింసిస్తున్నారు.. ముఖ్యంగా ఈ కేటగిరి భర్తలు అంధ్రప్రదేశ్ లో ఎక్కవగా ఉన్నారట.. ఈ విషయం మేము చెప్పడం లేదు.. కేంద్రం సర్వే చేసి మరి చెప్తోంది. ఏపీలోనే సైకో భర్తలు ఉన్నారని.. జాతీయ…
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ బిదిషా డి మజుందార్(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్ కత్తా లోని తన నివాసంలో గురువారం ఉదయం శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీలో పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న బిదిషా కోల్‌కతాలోని ఒక అపార్టుమెంట్ లో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇక 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఆమె గత కొన్నిరోజులుగా బయట కనిపించడం లేదు. బుధవారం ఇంట్లో…
ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ…
దేశంలోనే స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా టీహబ్ మారిందనడంలో సందేహం లేదు. టీ హద్ ద్వారా ఎన్నో కొత్త కొత్త స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్2ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్ నిర్మాణాన్ని చేపట్టింది. గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో స్టార్టప్‌లకు…
బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లోని ఇండియస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు…
ముగ్గురు లష్కరులను కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే.. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ముగ్గురు ముష్కరుల చొరబడ్డారనే సమాచారం అందడటంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. అయితే ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా…