ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా నాకు ఇంతటి ప్రోత్సహం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నానని నిఖత్ జరీన్ విన్నవించారు. కామన్ వెల్త్ గేమ్స్ కోసం నేను ప్రస్తుతం కృషి చేస్తున్నానని, రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా రాణిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అనేక విజయాలు సాదిస్తానని ఆయన వెల్లడించారు.