భర్త అంటే భరించేవాడు అంటారు కొందరు.. భర్త అంటే బాధ పెట్టేవాడు అంటారు మరికొందరు.. అయితే ఏది చెప్పినా భార్యాభర్తల మధ్య అనుబంధం పాలునీళ్ళులా ఉండాలంటారు పెద్దలు.. కానీ ప్రస్తుతం కాలంలో భర్తలు సైకోలు గా కాదు కాదు.. అంతకంటే ఎక్కువగా భార్యలను హింసిస్తున్నారు.. ముఖ్యంగా ఈ కేటగిరి భర్తలు అంధ్రప్రదేశ్ లో ఎక్కవగా ఉన్నారట.. ఈ విషయం మేము చెప్పడం లేదు.. కేంద్రం సర్వే చేసి మరి చెప్తోంది. ఏపీలోనే సైకో భర్తలు ఉన్నారని.. జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే లో ఏపీలో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో 18-49 ఏళ్ల వయస్సున్న పెళ్లయిన మహిళల్లో 35 శాతం మంది శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని తెలిపింది. అందులోనూ ఆ హింసను తట్టుకొని జీవిస్తున్న మహిళలు కొంతమంది ఉండగా.. భర్తల వేధింపులు తట్టుకోలేని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారట. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ 35% మంది బాధితులలో 4% మంది మహిళలు గర్భం తో ఉండడం.. వారిని కూడా సైకో భర్తలు వదలడం లేదని సర్వే చెప్పుకొస్తుంది. మాటలతో వేధించడంలో ఏపీ భర్తల తర్వాతే ఎవరైనా అని సమాచారం.
ఇంకా సర్వే ఏం తెలిపిందంటే.. 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 4% మంది గర్భవతులు ఉన్నారని, ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో హింసను ఎదుర్కొంటున్న వారిలో చదువుకున్న మహిళలు 12%, 3-4 మంది పిల్లలు ఉన్న మహిళలు 6%, వితంతువులు విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన లేదా విడిచిపెట్టిన మహిళలు 8% భర్తల ద్వారా, మగవారి ద్వారా హింసను ఎదుర్కొంటున్నారని రాసుకొచ్చింది. శారీరకంగా, లైంగికంగా భర్తలు పెట్టే బాధలను భరిస్తున్నారట.. ఇక హింసించడంలోనూ ఈ సైకోలు కొత్త పద్దతులను సృష్టించడంగమనార్హం.. 24% మంది భర్తలు చెప్పుతో రోజూ భార్యలను కొట్టడం చేస్తుంటే.. 11% మంది భర్తలు, భార్యలను తమపైకి నెట్టబడడం లేదా విసిరి కొట్టడం, తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. 8% మంది తమ చేతిని మెలితిప్పి, పిడికిలితో లేదా వారికి హాని కలిగించే వాటితో కొట్టడం వంటివి ఎదుర్కొన్నారని తెలిపింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైంగికంగా వేధించేవాళ్ళు.. 18-49 ఏళ్ల వయసున్న పెళ్లయిన మహిళల్లో మూడు శాతం మంది తమ భర్తలు తమకు ఇష్టం లేకపోయినా శారీరకంగా బలవంతం చేశారని తెలిపింది. భర్తల భార్యలను హింసించేటప్పుడు అది మానసింకంగా అయిన లేదా శారీరకంగా అయిన ఆ సమయంలో దాదాపు 76% మంది భర్తలు తరచుగా తాగి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక దీని బట్టి ఎన్ హెచ్ ఎఫ్ ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో తాగిన సమయంలో ఎక్కువ హింస మహిళల పై జరుగుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయమై రాజకీయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.