Mahesh Babu : ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైంది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని యావరేజ్ గా నిలిచింది. సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు.
Read Also:Real Estate: హైదరాబాద్‌లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరాకెక్కించారు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.. పాటల గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో కుర్చీ మడతపెట్టి సాంగ్ ని చార్ట్ బస్టర్ గా థమన్ అందించాడు అని చెప్పాలి.
Read Also:CM Chandrababu Serious warning: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా..! సీఎం సీరియస్ వార్నింగ్
ఈ సినిమాలో సెన్సేషనల్ హిట్ సాంగ్ ఏదన్నా ఉందంటే అది కుర్చీ మడతపెట్టి సాంగ్ అనే చెప్పుకోవాలి. అంటే అది కుర్చీ మడతపెట్టి అని చెప్పాలి. మరి ఈ సాంగ్ మన దక్షిణాదిలో చాలా రికార్డులను సెట్ చేసేసింది. ఫుల్ వీడియో సాంగ్ అండ్ లిరికల్ గా కూడా భారీ రికార్డులు సెట్ చేసిన ఈ పాట ఇపుడు మరో బ్లాస్టింగ్ రికార్డు క్రియేట్ చేసింది. మరి తాజాగా ఈ ఫుల్ వీడియో సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ అందుకుని సూపర్ స్టార్ ఖాతాలో హాఫ్ బిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్ గా రికార్డు సెట్ చేసింది. మరి సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ సాంగ్స్ మాత్రం ఓ రేంజ్ లో దుమ్ము లేపాయనే చెప్పుకోవాలి.
The electrifying #KurchiMadathapetti full video song from #GunturKaaram conquers the #YouTube throne 🔥 with an explosive 5️⃣0️⃣0️⃣M+ views!
A @MusicThaman Musical 🎹
✍ @ramjowrites
🎤 @itsahithii @srikrisinSUPER🌟 @urstrulyMahesh @sreeleela14… pic.twitter.com/KA33QKz6gC
— Aditya Music (@adityamusic) November 30, 2024