వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.
కార్తీక మాసం పోయిన తరువాత చికెన్ ధరలు క్రమంగా పెరగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మార్కెట్లో చికెన్ ధరలను పరిశీలిస్తే కిలో చికెన్ స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుకు పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తమిళ సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి. దాంతో ఇక్కడి వాళ్లకు కూడా అతను సుపరిచితమే.. శివకార్తికేయన్ నటించిన డాన్ లో నటించాడు యోగి బాబు. ఈ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు మూవీలోనూ…
భారతదేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని ఆయన తెలిపారు.. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీ సర్కార్ ఓవైపు వలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది.
నేడు గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీ చర్చ.. బీఆర్ఎస్ నుంచి చర్చలో పాల్గొననున్న కేటీఆర్, తలసాని, కౌన్సిల్ నుంచి చర్చలో పాల్గొననున్న మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్..
తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 1,800 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తొలి సంతకం చేశారు… త్వరలోనే నర్సింగ్ విద్యార్థుల కోసం 1800 పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన…