విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం అయింది. ఈ మీటింగ్ కు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ లీగల్ సెల్ ద్వారా మాత్రమే జరిగింది అని ఆయన తెలిపారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవటం కోసం కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు.. వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పని చేశారు అంటూ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు.
Read Also: Rajnath Singh: టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలి.. క్యాడెట్లకు రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు
కాగా, జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. కుల, మత వ్యవస్థలకు వ్యతిరేకంగా జగన్ పాలన అందిస్తున్నారు అని ఆయన చెప్పారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది అని వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఏపీలో జగన్ సర్కారు మళ్లీ తిరిగి అధికారంలోకి రాబోతోంది.. రానున్న 3 నెలల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలి.. టీడీపీ చేరుస్తున్న దొంగ ఓట్లపై కూడా లీగల్ గా పోరాటం చేయాలి అని ఆయన వెల్లడించారు.