భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. ఇటీవలి కాలంలో అందరినీ భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తోంది అని ఆయన తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్ దూసుకుపోతుందన్నారు. ఇక, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానికలలు కన్నారు.. ఈ కలను సాకారం చేసేందుకు ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.. కానీ, ఈ కల నెరవేరే అవకాశం లేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also: Hyderabad Thief: సీఎం వస్తే నేను లొంగిపోతా.. దొంగ డిమాండ్ కు పోలీసుల రియాక్షన్
ప్రస్తుత వృద్ధి రేటుతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 2500 డాలర్లుగా ఉంది.. మనం ఇదే స్థాయిలో ముందుకు సాగితే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం చాలా కష్టం అవుతుంది.. భారత ఆర్థిక వ్యవస్థలోని కొన్ని భాగాలు అభివృద్ధి చెందిన దేశాలలా ఉన్నాయన్నారు. అయితే, 2016 డీమోనిటైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నపై రఘురామ్ రాజన్ స్పందిస్తూ.. డీమోనిటైజేషన్ ప్లాన్ పని చేస్తుందా లేదా అని ప్రధాని కార్యాలయం తనను అడిగింది.. దీనిపై, నేను నా బృందం ఈ నిర్ణయంలోని మంచి, చెడులను చెప్పాము అని రాజన్ తెలిపారు.
Read Also: High-Speed Flying-Wing UAV: భారత్ హై-స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యూఏవీ టెస్టింగ్ సక్సెస్
అయితే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరం నాటికి అంటే 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం చాలా కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం, $3.7 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.. అదే టైంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ భారతదేశ నామమాత్రపు జీడీపీ వచ్చే 7 సంవత్సరాలలో 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని విశ్వసిస్తోంది అని రాజన్ చెప్పారు. అలాంటి పరిస్థితిలో 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది అనే నమ్మకంతో ప్రధాని మోడీ సర్కార్ ఉంది.. కానీ, భారతదేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని ఆయన తెలిపారు.. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.