తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది.
రేపు(మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు.
చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత దేశం నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదే అని అన్నారు.
చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు.
టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.. ఒకప్పుడు…
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.