Supply Chain: చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత దేశం నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదే అని అన్నారు. ఇక, ఈ ఏడాది మన దేశానికి పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో తన అభిప్రాయం వెల్లడించారు.
Read Also: Venu Swamy: టాలీవుడ్ సూపర్ స్టార్ కి ఆరోగ్య సమస్యలు- సినిమాలకి గుడ్ బై.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
జనవరి 1వ తేదీ అంటే కేవలం క్యాలెండర్‌లో మారే డేట్ మాత్రమే కాదు.. ఇది చాలా ప్రత్యేకం అని ఆనంద్ మహీంద్రా అన్నారు. కొత్త ఆరంభానికి చిహ్నం అని చెప్పారు. గతేడాది ఎంత చీకటిగా గడిచినా, భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఉండే సామర్థ్యం మనకు ఉందన్నారు. గత సంవత్సరం(2023) యుద్ధాలు, వాతావరణ మార్పుల సంవత్సరంగా నిలిచిపోయింది.. కానీ, ఈ కొత్త ఏడాదిలో వాటి నుంచి బయటపడి పునరుజ్జీవం కోరుకుంటూ 2023కు ప్రపంచం ముగింపు పలికింది అని మహీంద్రా పేర్కొన్నారు. అలాంటి ఆశావహ దృక్పథానికి ఈ కొత్త ఏడాదిలో తొలి రోజు సరికొత్త ఛాన్స్ కల్పిస్తుంది.. కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
Read Also: Gidugu Rudraraju: త్వరలోనే కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల?.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా..!
ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వేదికపై మనకున్న అవకాశాల గురించి ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత్ ప్రత్యామ్నాయంగా మారడం ఈ ప్రపంచానికి చాలా అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కొత్త ఏడాదిలో మనకు వచ్చిన గొప్ప ఛాన్స్ ఇది.. భారతదేశం తయారీ రంగం అద్వితీయ ఘనత సాధించే ఛాన్స్ మనపైనే ఆధారపడి ఉందన్నారు. దాన్ని మనం రెండు చేతులతో ఒడిసిపట్టుకోవాలంటూ సూచించారు. తయారీ, ఎగుమతులు పెరిగితే వినియోగ రంగం కూడా విస్తరిస్తుందని ఆనంద్ మహీంద్రా చెప్పారు. గతేడాది అనేక సవాళ్లను దాటుకుని భారత్ అసాధారణ విజయాలను నమోదు చేసింది.. ఈ కొత్త సంవత్సరంలోనూ మనం మరిన్ని రికార్డులు సాధించాలని ఆనంద్ మహీంద్రా ఆకాంక్షించారు.
Greetings to you all. Have an exciting and fulfilling New Year. 🙏🏽 pic.twitter.com/mmxhCzN2zT
— anand mahindra (@anandmahindra) January 1, 2024
The most attractive & energising visual greetings I received this New Year. From Bhutan.
Welcome to the Year of the Dragon.I learned that:
“In ancient times, people thought that Dragons were best suited to be leaders with their character trait of ambition.
Gifted with innate… pic.twitter.com/fFv7XMg32R— anand mahindra (@anandmahindra) January 1, 2024