ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు అని మళ్ళీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారని, కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు.…
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి…
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన దుబ్బాకలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయన్నారు. బీజేపీ అడుగులకు మాడుగుల ఒత్తే పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని బీజేపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాతే కాంగ్రెస్…
ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లో మీ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. మీ సలహాలు, సూచనల పాటించాం….గెలిచామని, సఖ్యతగా పనిచేస్తే గెలిచె అవకాశం ఉన్నదని మీరు చెప్పారు, మేం కలిసి గెలిచామన్నారు. ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఖచ్చితంగా అమలు చేస్తామని,…
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ కు వాస్తు మార్పులు చేపట్టారు అధికారులు. స్టేషన్ కు వాస్తు దోషం ఉండడం వల్లే కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఎస్సైలు వివాదాలతో బదిలీనో లేక సస్పెన్షన్ కో గురవుతున్నారని భావించిన అధికారులు.. వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు మార్పుల్లో భాగంగా స్టేషన్ ముందు భాగం లో ఉన్న స్టోర్ రూమ్ ను గత నెల 29న కూల్చివేశారు పోలీస్ అధికారులు… హైదరాబాద్ నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెంట, హైదరాబాద్ కు దగ్గరగా…
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ కంట్రీ చైనా పేరుగాంచింది. అయితే, గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కరోనా అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకత్వం వెల్లడించారు.
17 డిగ్రీస్ నార్త్ ఆధ్వర్యంలోని పైరేట్-ఇన్ఫ్యూజ్డ్ న్యూ ఇయర్ పార్టీ ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతమైన ఏడాదికి ముగింపు పలుకుతూ సరికొత్తగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది.
రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదం కేసును ఇవాళ విచారిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్), ఎన్నికల చట్టం 2017కి సవరణ ప్రకారం అనర్హత కాలానికి సంబంధించిన అన్ని వివాదాలను చీఫ్ జస్టిస్ ఖాజీ ఇసా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది.
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరమంటే డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి 12 గంటలు దాటుతున్న టైంలో సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఆ సమయంలో ప్రపంచమంతా ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్తారు.