నూతన సంవత్సరంలో విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో టీమిండియా మహిళల జట్టు భావిస్తుంది. ఇవాళ ఆస్ట్రేలియా మహిళలలో జరిగే చివరి వన్డేలో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. ఫలితంగా ఆసీస్ పై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను దక్కించుకోవాలని అనుకుంది కానీ, చివరికి టీమిండియాకు నిరాశే ఎదురైంది.
Read Also: Donald Trump : చీటింగ్ కేసులో ట్రంప్ 250 మిలియన్ డాలర్ల జరిమానా.. అతడి బిజినెస్ నిషేధం
అయితే, లాస్ట్ వన్డే మ్యాచ్ లో నైనా విజయం సాధించాలని చూస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో బాగా రాణించిన విజయం సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్ లో మాత్రం తడబడింది. సమష్టి ప్రదర్శన లేకపోవడం వల్ల మ్యాచ్ పై దాని ప్రభావం చూస్తుంది. భారత్ తరపున బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
Read Also: Astrology: జనవరి 02, మంగళవారం దినఫలాలు
ఇక, తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓడిపోయింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో గెలిపు అంచుల వరకు వెళ్లిన వరుస వికెట్లు పడిపోవడంతో కేవలం మూడు పరుగుల తేడాతో మ్యాచ్ చేజారింది. అంతే కాకుండా రెండో మ్యాచ్ లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్ లు వదిలేశారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ ల్లోనూ ఫెయిల్ అయింది.
Read Also: Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురు మృతి.. ఇంఫాల్‌లో కర్ఫ్యూ
అలాగే, చివరి సారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓడిపోయింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో ఓటములకు తెర దించాలంటే చివరి వన్డేలో హర్మన్ ప్రీత్ సేన రాణించాల్సి ఉంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాటింగ్ లో రాణించాలి.. అటు బౌలింగ్ లో రేణుక సింగ్ తో పాటు స్పిన్నర్లు కూడా రాణిస్తేనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరోసారి ఆస్ట్రేలియా టీమ్ రాణిస్తే వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం సాధ్యం అవుతుంది.