తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందనీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలిరోజు రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ కి సంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి , అక్షింతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామమందిరా దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దర్శనానికి తప్పకుండా వస్తానని చెబుతూ.. ఆనందంతో అక్షింతలు స్వీకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలతో రాజ్ భవన్ లో హోరెత్తించారు. రామ లక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ ప్రతిగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా నినాదించడం విశేషం.
Read Also: Manchu Manoj: మనోజ్ అన్నా.. మెగా అల్లుడునే దింపావా..?
ఇక, రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువును అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు కోట్లాదిమంది హిందువులను కలిసి అక్షింతలు అందజేసి అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రతి గ్రామము, బస్తీ, పల్లె, తండా, గిరిజన ప్రదేశాలకు కూడా రాముడి అక్షింతలు చేరాయని.. వాటిని పంపిణీ ఈ రోజుతో ప్రారంభమైందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సురేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.