వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని, అందంగా ఉండాలని అనిపిస్తుంది. దీనికోసం రకరకాల మందులు వాడేవాళ్లు కూడా ఉంటారు. ఈ గొప్ప ఆహార పదార్థాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే మీరు 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించాలంటే, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బ్రకోలీని చేర్చుకోవాలి.
చేతిలో చీపురు పట్టుకుని రోడ్ల మీద ఉన్న చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్‌ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో గత నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు.
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. సిటీ లో భారీగా ఈవెంట్స్ , పార్టీ లు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించడానికి యువత రెడీ అయ్యింది. రాత్రి 1 గంటల వరకే వేడుకలు చేయాలనీ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. తాగి మద్యం వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు హైదరాబాద్ లో అన్ని ఫ్లై…
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్‌లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన…
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు.
రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని.. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అధికారులకు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఇవ్వాల సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన…
రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల…