టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్- టైమ్ పని తీరు కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది.
మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధి పై మంగళవారం నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్…
హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. లక్డీకపూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12, రోడ్ నెం. 1లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఊహించని రీతిలో వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఐకియా, గచ్చిబౌలి, నానాక్‌రామ్‌గూడలో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో వేల కొద్దీ…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై సింగరేణి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్ ఏ సి)గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.బలరామ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించగా.. తగినంత బొగ్గు రవాణాను ఎటువంటి కొరత లేకుండా కొనసాగిస్తామని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందజేస్తామని…
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆయన మాట్లాడిన మాటల్లో సత్యదూరం అయినవి ఉన్నవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కలిసి 3500 రోజులు గడిపారని, పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ అన్ని విషయాల్లో కలిసి పని చేసారన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నవని, కాళేశ్వరంకు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు…
మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇవాళ ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్దఎత్తున బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్…
ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు అని మళ్ళీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారని, కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు.…
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి…