తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ముఖ్యమైన పరిణామంగా , ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల కారణంగా రెండు ఎమ్మెల్సీ పదవులు పోటీకి తెరలేవడంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనవరి 11న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వ్యూహాత్మక పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే…
ఇరాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని కెర్మాన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది.
బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గెంతేస్తారు కదా! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు చెన్నైలో ఓ ఐటీ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు.
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల…
రజక, నాయీ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రజక, నాయీ బ్రాహ్మణులకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణ…
అమెరికాలోని లాస్ వెగాస్ లో ఇందుకు భిన్నంగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయి.. పరుగు పరుగున వచ్చి న్యాయమూర్తి( జడ్జి ) పై దూకి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. టీచింగ్ బ్లాక్‌లో ఇవాళ తెల్లవారుజామున ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి.