PM Modi: లక్షదీవుల్లో ప్రధాని స్నార్కెలింగ్ సాహసం.. ఫొటోలను పంచుకున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ ప్రాంతాలను సందర్శించారు. లక్షద్వీప్‌లోని అద్భుతమైన అనుభవాలను చెప్పడంతో పాటు, అక్కడి ప్రజలకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Iran Bomb Blasts: ఇరాన్‌లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లోని బీచ్‌లో గడిపారు. వారు బీచ్‌లో ప్రశాంతత, ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ సాహసానికి సిద్ధంగా ఉంటారు. లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ఆయన సముద్రంలో స్నానం చేసి లోతైన నీటిలో స్నార్కెలింగ్ చేశారు. ప్రధాని మోడీ ఎప్పుడూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన లక్షద్వీప్ పర్యటనలో కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నారు. సముద్ర తీరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై సందేశం ఇచ్చారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న లక్షద్వీప్ అందాలను కూడా ప్రధాని చూపించారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ అడవి చిత్రాలను ఆయన పంచుకున్నారు. లక్షద్వీప్ వైపు పర్యాటకులను ఆకర్షించడానికి ఈ చిత్రాలు సరిపోతాయి.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024
స్నార్కెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్కెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడుతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషించొచ్చు. అలాంటి సాహసం చేశారు ప్రధాని మోడీ.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!