ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.
కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే…. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా స్పందించారు. ‘‘ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు..…
ఊహించిన విధంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో దఫా భారీ ఐఏఎస్‌ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల్లో 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.శాసనసభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం స్థిరపడి, ఏకకాలంలో 2024లో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఈ బదిలీలు కీలకమైనవి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రంలోని 26 మంది ఐఏఎస్ అధికారులను…
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారలను అభయ హస్తం పథకంలో ఇందిరమ్మ ఇళ్లు జాబితాలో చేర్చాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గృహలక్ష్మి పథకంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఆరు గ్యారేంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో చేర్చి బిల్లులు చెల్లించాలని కోరారు. పార్టీలకు అతీతంగా, జిల్లా కలెక్టర్లు, అధికారుల ప్రత్యక్షంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభం…
చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను రాష్ట్ర సచివాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరము పురస్కరించుకొని భట్టి విక్రమార్కతో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేతగా పాదయాత్ర చేసినటువంటి ఫోటోలను టీపీసీసీ…
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇంటర్ బోర్డుకు సంబంధించిన150 కోట్లు ను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను 52 కోట్లు కూడా ఇంటర్ బోర్డ్ నుండి చెల్లించాలని ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉచిత విద్యకు ఈ పది ఏళ్లలో ఖర్చు చేసింది…