అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కొత్త ఏడాదిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా.. అదానీ నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్‌టి కియోసాకి ప్రస్తుతం తీవ్ర అప్పుల్లో ఉన్నారంటూ ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు.
కశ్మీర్ లోయలోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామున షోపియాన్‌లోని ఛోటిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
హౌతీ రెబెల్స్ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది.
ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు నేటి నుంచి ఆదివారం వరకు స్థానిక గైట్ కళాశాల ప్రాంగణం ఆతిథ్యమిస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా…
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై గురువారం ఆయన సచివాలయంలో…
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి తెలియజేసారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తూ శాఖను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో, వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంలో గ్రామీణ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో…
రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (State Council for Education Research and Training) కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యా పరిశోధన, శిక్షణ లో సంస్కరణలు తేవాలన్నారు. విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా మంచి శిక్షణ, పరిశోధన కేంద్రంగా…