ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు.
2023 అక్టోబర్ 21న కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడవ బ్లాక్‌లోని 19-21 పియర్స్ కుంగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని, ఈ రెండు ప్రమాద ఘటనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలో సర్వత్రా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలపై న్యాయ విచారణకు…
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.
15,644 పోలీసు కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లోగా ప్రారంభించాలని, త్వరితగతిన ఎంపికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం, ‘తప్పు ప్రశ్నల’ వివాదాన్ని తొలగించాలని కోరిన స్వతంత్ర నిపుణుల సంఘానికి మళ్లీ సూచించింది. స్వతంత్ర నిపుణుల సంఘం నుంచి రెండో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎంపిక…
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల యోజన భైఠక్ పేరుతో జరిగిన కీలక భేటీలో.. ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్‌ఎస్‌లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు..…
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది.
మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్‌లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.