బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్ముల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తైవాన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తుంది.
టాలివుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇకపోతే…
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు.
అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. జీతాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు పట్టుబట్టాయి. ఇప్పటికిప్పుడు పెంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.
అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 2024 జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపైనే అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పట్టుబట్టారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాలు పెంచుతాం అని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి.
పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.