రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో…
తెలుగు జాతి రత్నం, నిజాయతీకి నిలువుటద్దం అయిన రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖుకు అందించిన ఈ అవార్ట్ ఇప్పుడు బాబూరావును వరించింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుదాఘాతానికి మరియు సరఫరాలో ట్రిప్పింగ్‌కు కారణమయ్యే అవకాశం ఉందని, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ స్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) ప్రజలకు సూచించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, TSSPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ప్రజలు విద్యుదాఘాతానికి కారణమయ్యే లోహపు పూతతో కూడిన దారాలను ఉపయోగించడం…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పండగలు వచ్చాయంటే చాలు ప్రధాన నగరాలు అన్ని ఖాళీ అవుతుంటాయి.. జనాలు అంతా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు.. పల్లెటూరు పండగల హడావిడి గురించి మాటల్లో చెప్పలేము.. అందరు కలిసి ఆనందంగా జరుపుకొనే పండుగలో సంక్రాంతి ఒకటి.. ఈ పండుగకు అందరు పల్లెలలకు వెళ్ళాల్సిందే.. రేపు పండుగ కావడంతో జనాలు ఈరోజు ఉదయం నుంచే ఊర్లకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యినట్లు తెలుస్తుంది.. తెలంగాణాలో సంక్రాంతికి…
హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం…
ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. అయితే కొన్నిసార్లు కస్టమర్లకు అనుకోని అతిధులు కూడా వస్తుంటాయి.. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి షాక్ అయ్యాడు.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు లోని ఓ వ్యక్తి ఎంతో ఆశగా ఆన్లైన్లో చికెన్ షవర్మా ను ఆర్డర్ చేశాడు.. స్విగ్గీ నుంచి అది రాగానే ఎంతో…