చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తైవాన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తుంది. దీంతో ఈ ద్వీపకల్పాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కూడా తమ అధీనంలోకి తీసుకున్నట్లు టాక్. ఇక, తైవాన్‌లోని బ్యాంకులు క్లోజ్ కాబోతున్నాయి. ప్రజలు కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్‌లైన్‌లోనే వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమికండక్టర్ పరిశ్రమ తైవాన్‌లో ఉంది.. అది కూడా స్తంభించిపోయింది. చైనా ప్రత్యక్షంగా తన సేనలను పంపడం తప్ప మిగిలిన అన్ని విధాలుగా తైవాన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. డ్రాగన్ కంట్రీ ప్రత్యక్షంగా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 828 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Chandrababu: నేడు సీఐడీ ఆఫీస్‌కి చంద్రబాబు..
అలాగే, స్వయం ప్రతిపత్తి పాలనలో ఉన్న తైవాన్‌ను తమ భూభాగానికి సంబంధించినదిగా చైనా భావిస్తుంది. చైనా తమపై దాడి చేసిన రోజున కేవలం తమ రక్షణ వ్యవస్థకు, భద్రతా దళాలకు మాత్రమే నష్టం జరుగదు.. తైవాన్‌ను పూర్తిగా ఈ ప్రపంచం నుంచి వేరుచేయడానికి ట్రై చేస్తుందని ఆ దేశ సైబర్ నిపుణులు తెలిపారు. ఇప్పటికే తైవాన్ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై ప్రతిరోజు లక్షల సంఖ్యలో సైబర్ దాడులు కొనసాగుతున్నాయని తైవాన్ జాతీయ రక్షణ, భద్రత పరిశోధన సంస్థ నిపుణుడు క్రిస్టల్ టు పేర్కొన్నారు. చైనా ఆక్రమణను ప్రకటించగానే వారు తమ టెలికమ్యూనికేషన్లను, ఇంధనం, ఆర్థిక రంగాలను స్తంభింపచేయగలరని తైవాన్ చెప్పింది.
Read Also: Saindhav Twitter Review: వెంకీ మామ యాక్షన్ అదుర్స్..సినిమాకు అదే హైలెట్..!
ఇక, సైబర్ నేరస్థులు తైవాన్ ప్రభుత్వ, రక్షణ సంస్థలనే కాకుండా అక్కడి సెమికండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అవసరమైతే ధ్వంసం చేస్తాం తప్ప వాటిని చైనా దళాల చేతిలో పడనివ్వబోమని అమెరికాకు చెందిన ఓ అధికారి గత ఏడాది వెల్లడించారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన త్సాయి ఇంగ్-వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా 2016లో ఎన్నికైయింది. అప్పటి నుంచే చైనా ఆ దేశంపై దౌత్యపరమైన, సైనికపరమైన ఒత్తిడిని స్టార్ట్ చేసింది. తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో పాటు తమపై ఇతర దేశాల పెత్తనాన్ని నిరాకరించడం చైనాకు నచ్చలేదు.. దీంతో క్రమంగా తైవాన్‌కు ఇబ్బందులు సృష్టిస్తుంది. దీంతో ఏదో ఓ రోజున చైనా తైవాన్‌పై దురాక్రమణకు పాల్పడవచ్చన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సైబర్ దాడులతో చైనా ఆగిపోదు, ప్రపంచంతో తైవాన్‌కున్న సంబంధాలను తెగ్గొట్టేందుకు ట్రై చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Venkateshwara Stotram: పుష్యమాసం ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి
అయితే, తైవాన్‌పై యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతుందని బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్ సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల జరిగిన నష్టం కన్నా ఎక్కువ అని తెలిపింది. తైవాన్ ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద భావన, వాషింగ్టన్- బీజింగ్ మధ్య విచ్ఛిన్నమవుతున్న సంబంధాలు, పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తిని బట్టి తైవాన్‌లో సంక్షోభం తప్పకపోవచ్చని నిపుణులు అంచనా తెలిపింది. చైనా దురాక్రమణకు పాల్పడితే.. తైవాన్‌లోని సెమికండక్టర్ల వ్యవస్థ కుప్పకూలుతుంది.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్ల తయారీ స్తంభించిపోతుందని సమాచారం.