సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. లేఖలో ‘మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటినుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.…
500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని… ముఖ్యంగా భవ్య మందిర నిర్మాణంలో కరసేవకుల పాత్ర కీలకమని, వారి త్యాగం చిరమస్మరణీయమని కొనియాడారు. ఎంతోమంది వారి జీవితాలను త్యజించి, కుటుంబాలను వదులుకొని సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నరేంద్ర మోడీ…
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందని, కుటుంబం మొత్తం అల్లుకు పోయే కథలతో కొత్త సినిమాలను తెరకేక్కిస్తున్నాడు.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు అన్ని ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడితో పేరు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమా గుంటూరు…
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితం ప్రారంభించింది ధరూర్ గ్రామం నుండే అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత ఎపుడు జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తుంది, బిఆర్అస్ ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతంపై విశ్వాసం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వస్తాయి పోతాయి.. ఎన్నికలలో నేను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు..ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా…
ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
విమానాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ (ఏఐ) వల్ల లాభ పడే వారికన్నా నష్టపోయే వారిసంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది.. ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు.. దాదాపు అన్ని కంపెనీలు అలానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇప్పుడు మరో మల్టీ నేషనల్ కంపెనీ కూడా ఆ లిస్ట్ లోకి మరో కంపెనీ చేరింది.. జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపీ SAP కూడా ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉంది.. కృత్రిమ మేధస్సు పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ…