భారతీయ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాల కోసం మాత్రమే కాకుండా బాలికల హక్కుల గురించి అవగాహనను పెంపొందించడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.
తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా... వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు ఇవాళ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనుంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి(బుధవారం) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది.
సోమాలియాపై నిన్న (మంగళవారం) అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు అల్-ఖైదా-సంబంధిత అల్-షబాబ్ మిలిటెంట్లు మరణించారు. పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని యూఎస్ ఆర్మీ తెలిపింది.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంపై మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. త్వరలో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తీరనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.
సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి.. సినీ నటీనటులు తన నటన ద్వారా అందరిని మెప్పించి ఈ అవార్డులను అందుకోవాలని భావిస్తుంటారు.. నామినేషన్లలో అర్హత సాధించినా గొప్ప విషయంగానే భావిస్తారు. ఈ పురస్కారాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ అలాంటిది మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు.. రఘుబీర్ యాదవ్.…