భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసాన్నికి ఫిబ్రవరి 5వ తేదీన ఖరారు అయింది. అవిశ్వాసానికి సంబంధించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావును కలిపి 19 మంది కౌన్సిలర్లకు విప్ నోటీస్ జారీ చేసి చైర్మన్ కు షాక్ ఇచ్చింది. ఇల్లందు మున్సిపల్ లో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో బి ఆర్ఎస్ పార్టీ టికెట్ తో చైర్మన్ తో కలిపి 19మంది వార్డు…
రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం…
తమ నియోజకవర్గాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ ఏకైక ధ్యేయమని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలవడాన్ని తప్పుపట్టలేమని మెదక్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టం చేశారు. సంయుక్తంగా విలేకరుల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కె ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), జి మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), మాణిక్ రావు (జహీరాబాద్) మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, ప్రోటోకాల్ సమస్యలకు ప్రాతినిధ్యం వహించేందుకే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, ఇతర…
లక్డికాపుల్ ని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్, రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదిప్ దురశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముధుసుదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై, పెండింగ్ లో ఉన్న పనులపై, వివిధ శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే…
స్మార్ట్ వాచ్ లు ఎంతగా ఉపయోగ పడుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి ఓ ప్రముఖ కంపెనీ వాచ్ ఇప్పుడు ట్రేండింగ్ ఉంది.. యాపిల్ స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనేక రకాల హెల్త్, ఫిట్‌నెట్ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్ స్మార్ట్‌వాచ్ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన…
వివిధ కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ క్లస్టర్, చేరికల సమన్వయ కమిటీ, లబ్దిదారుల సంపర్క్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కమిటీ, యువ సమ్మేళనాలు కమిటీ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తీ చేయాలని ఆదేశించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 వేల చోట్ల గోడ వ్రాతలు, ప్రతి పోలింగ్…
బాల రాముని ప్రాణ ప్రతిష్ట ప్రపంచం మొత్తం వీక్షించిందన్నారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలలో నుండి కూడా మట్టి,నీరు బట్టలు ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కు పంపించారన్నారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆత్మగౌరవ ఈవెంట్‌గా జరిగిందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే పట్టనట్టు నడుచుకున్నారన్నారు. తెలంగాణాలోని ప్రధాన దేవాలయాల నుండి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి.. కానీ అవేవీ లేకుండా ఈ ఎండోమెంట్…
ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది.. గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023 లో దాదాపు 14,418 మందికి వివిధ…
బీసీలకు అండగా ఉంటామని చెప్పి, అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను హత్యలు చేస్తూ, అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తుందని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కొలిమిగుండ్లలో టీడీపీ బీసీ నాయకుడిని చంపిన వారికి శిక్ష పడేవరకు వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలలో రాజకీయ చైతన్యం కల్పిస్తే,..బీసీ కులాల సంక్షేమానికి పాటుపడి, వారికి గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు అని అన్నారు. బీసీ కులాల నాయకులకు…
మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగి వస్తాయని…ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చలో దిల్లీకి పిలుపునిచ్చినట్లు… దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్…