టాలివుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందని, కుటుంబం మొత్తం అల్లుకు పోయే కథలతో కొత్త సినిమాలను తెరకేక్కిస్తున్నాడు.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు అన్ని ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడితో పేరు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమా గుంటూరు కారం..
ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.. ఈ సినిమా కొందరికి బాగా నచ్చింది.. కొంతమందికి పెద్దగా నచ్చలేదు.. పర్ఫామెన్స్ పరంగా, డ్యాన్సుల పరంగా మహేష్ బాబు ఇరగదీసేవాడు. కానీ, త్రివిక్రమ్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది. అయితే ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది..
ఇక ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. గతంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు.. ఆ తర్వాత ఆ సినిమాను చెయ్యలేదు.. కానీ, ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే పరిస్థితే లేదు.. అయితే ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని లపై ఫోకస్ పెట్టాడు…కోలీవుడ్ స్టార్ సూర్య సైతం త్రివిక్రమ్ లైనప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎవరితో ప్రకటిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి..