వివిధ కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ క్లస్టర్, చేరికల సమన్వయ కమిటీ, లబ్దిదారుల సంపర్క్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కమిటీ, యువ సమ్మేళనాలు కమిటీ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తీ చేయాలని ఆదేశించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 వేల చోట్ల గోడ వ్రాతలు, ప్రతి పోలింగ్ బూత్ లో 5 చోట్ల వాల్ రైటింగ్స్ పూర్తి కావాలన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో కిసాన్ మోర్చ జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Janasena: జనసేనలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి.. శ్యాంబాబు వేషధారణతో ప్రచారం!
మహిళ, యువ ఓటర్ ల పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలతో మాతృ శక్తి సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. యువ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు సునీల్ బన్సల్. అంతేకాకుండా.. ఈ నెల 28న అమిత్ షా పర్యటన పై సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో రథ యాత్రలు పై చర్చించారు. 26న తిరంగా యాత్రలు నిర్వహించాలని ఆయన కమిటీ సభ్యులకు తెలిపారు. రేపు నవ ఓటర్ ల సమ్మేళనాలు… వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల తో బీజేపీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.