ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వేధిస్తున్నారంటూ ట్రాక్టర్ డ్రైవర్లు హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. నగరంలో వివిధ ప్రాంతాలలో ట్రాక్టర్లు నడుపుతూ జీవనం సాగిస్తున్న తమపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో కూల్చివేసిన మెటీరియల్ ను ట్రాక్టర్ లలో తాము తరలిస్తుంటామని… ఆ మెటీరియల్ కింద పడకుండా బట్టను కట్టి తీసుకెళ్తుంటామని వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ట్రాఫిక్ పోలీసులు తమకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా పర్యటనకు ఏర్పాట్లు చేశారు అధికారులు.…
సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.
పార్టీ ఫిరాయింపుల పై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడకొడతం అంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలా కులుస్తావో మేము చూస్తాం, మేము ద్వారాలు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవడం ఖాయమని ఆయన వెల్లడించారు. మాతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఫిరాయింపులు వద్దని మా హై కమాండ్ చెప్పడం వల్లే ఆగామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
ఖమ్మం పార్లమెంటు సీటు పై పలువురి కన్ను పడింది. కాంగ్రెస్ లోని ముఖ్యులు ఈసీటుకోసం ప్రయత్నాలు ప్రారంబించారు. ఇందులో బాగంగా పది మంది లిస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది. మరో వైపున ఖమ్మం ఎంపి గా సీటు మల్లు నందినికి ఇవ్వాలని కోరుతు గాంధీ భవన్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలా అందించిన వారు అంతా భట్టి వర్గీయులు .. అయితే…
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్‌ప్రెస్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో పలు షోలలో సందడి చేస్తుంది.. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఆమె ఇప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తుంది.. గత ఏడాది స్టార్ హీరోల సరసన భోళా శంకర్, జైలర్ వంటి సినిమాల్లో నటించింది… అలాగే కొన్ని…
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని అనుమానిస్తుండగా.. మృతుడి శరీరంపై విచక్షణ రహితంగా గాయాలు వున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.