భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న కీలక పరిణామం జరిగింది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం అయింది.
విశాఖ జిల్లాలో తహశీల్దార్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లి ఓ ఆగంతకుడు రాడ్‌తో కొట్టి చంపేశాడు. రెవెన్యూ సిబ్బందిపై ఈ తరహా దారుణం విశాఖలో మొదటి సారి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఇండియాలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారు. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్కయ సంస్థ వెల్లడించింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు.
నేడు ఒడిశాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్‌పూర్ కు ఆయన వెళ్తారు.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం అంబాజీపేటలో అంతరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అంబాజీపేట జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో అంతర్రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరగగా.. పురోహిత జట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పంచెలు కట్టుకొని బ్రాహ్మణ పురోహితులు క్రికెట్ ఆడారు.
మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.