శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది.
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దర్శకుడు…
ఈ మధ్య సినిమాల కన్నా వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అవుతున్నాయి.. స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులను అల్లరిస్తున్నారు.. ముఖ్యంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కథలతో వస్తున్న వెబ్ సిరీస్ లు ఓటీటీ లో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎల్ఎస్‌డీ కూడా ఓటీటీ లోకి రాబోతుంది.. ఈ సిరీస్ లో ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి,…
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.…
సచివాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ కన్సులేట్ జనరల్ బెంగళూరు, థేయిరి బెర్తెలోట్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి ఫ్రాన్స్ కాన్సూల్ జెనరల్ బెర్తేలోట్ కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్నా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి…
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఇది కలన లేక నిజమా అన్నటుందన్నారు. మళ్లీ హోటల్ పెడతామని అసలు అనుకోలేదని, కానీ ముఖ్యమంత్రి…
కాంగ్రెస్ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో ఇరువురు నేతలు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులఎమ్మెల్యేలు హాజరవుతారయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం ఉత్సవానికి హాజరైన ముఖ్య అతిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా తన నియామకానికి…
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే అని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు…
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న…