టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో పలు షోలలో సందడి చేస్తుంది.. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఆమె ఇప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తుంది.. గత ఏడాది స్టార్ హీరోల సరసన భోళా శంకర్, జైలర్ వంటి సినిమాల్లో నటించింది… అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు చేసేసింది..
గత ఏడాది వచ్చిన వెబ్ సిరీస్ లలో తమన్నా ఎంత హాట్ గా నటించిందో చూశాం.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతుంది.. అమెజాన్ ప్రైమ్ వీడియో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కామెడీ జానర్ కావడం విశేషం.. సినిమాల్లో కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లలో గ్లామర్ డోస్ పెంచింది.. మరో అడుగు ముందుకేసి బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతేడాది ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన జీ కర్దాతోపాటు నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2లోనూ నటించింది..
ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించబోతుంది.. ఇక డాక్టర్ అరోరా, తోడా అడ్జస్ట్ ప్లీజ్, సేపియాలాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన అర్చిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ కు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే తమన్నా ఓవైపు ఓటీటీ షోలతోపాటు మరోవైపు సిల్వర్ స్క్రీన్ పైనా మెరుస్తూనే ఉంది. హిందీలో జాన్ అబ్రహంతో కలిసి తమన్నా వేదా అనే సినిమా కూడా చేస్తుందని తెలుస్తుంది. అలాగే మరో రెండు మూడు ప్రాజెక్టు లకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..