తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా పర్యటనకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందర్వెల్లి మండలం కేస్లాపూర్ గ్రామం, ఇందర్వెల్లి మండల కేంద్రంలోని ఏర్పాట్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు.
ఈ పర్యటనలో 400 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను కలుస్తారని, కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో ధ్వజస్తంభం ఆవిష్కరణ, స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. డీఐజీ ర్యాంక్ అధికారి, ఇద్దరు ఏడీఐజీలతో సహా 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పొరుగు జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. ఇందర్వెల్లి మండల కేంద్రంలోని నాగోబా ఆలయం, అమరవీరుల స్మారక స్థూపం ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నాయి.