వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాల నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో సినిమా లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మాణంలో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు డిఫరెంట్ కథతో వస్తున్నట్లు…
జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైన అంటే అసలు ఊరుకోడు.. ఇప్పుడు తాను పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వార్తలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ…
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా…
Commissioners Transfers: తెలంగాణలో బదిలీలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది.
ఒక సినిమా విడుదల అవ్వడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. అలాగే ఓటీటీ లో కూడా విడుదల అవ్వడం కూడా ఈ మధ్య కష్టంగా మారింది.. పెద్ద సినిమాలు సైతం ఓటిటి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సినిమాల సంగతి అయితే చెప్పక్కర్లేదు.. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయి.. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ డేట్ కోసం ‘ఈగల్’ తప్పుకుంది. ఫిబ్రవరి 9 న ఈ…
ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా లేరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును అందరం గౌరవించాలన్నారు. కానీ కేసీఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. నాకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారని, నాకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారు అంటూ ప్రజలు…
చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టం, ఎందుకంటే ఈ సీజన్‌లో చాలా పండ్లు, కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. మంచి జీర్ణక్రియ కారణంగా, ప్రజలు శీతాకాలంలో అనేక రకాల పదార్థాలను తింటారు. కొన్నిసార్లు స్పైసీ పిజ్జా, కొన్నిసార్లు బర్గర్‌లు మరియు కొన్నిసార్లు స్వీట్లు, చలికాలంలో అతిగా తినడం తర్వాత బరువు తగ్గడం గురించి ఆలోచిస్తారు. బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటూ రకరకాల డైట్ ప్లాన్స్ చేసుకుంటూ, గంటల తరబడి జిమ్‌లో చెమటలు కక్కుతూ, కొన్నిసార్లు యోగాను ఆశ్రయిస్తారు. ఇవన్నీ…
`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి…
గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
పదేండ్లు అధికారంలో ఉండి.. ఆంధ్రా నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. చేపల పులుసు తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తనని శపథం చేసిన కేసిఆర్.. ఇప్పుడు అధికారం పోగానే గజినిలా గతం మరిచిపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. 2015 లో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇప్పుడు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను…