వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాల నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో సినిమా లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మాణంలో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు డిఫరెంట్ కథతో వస్తున్నట్లు తాజాగా రిలీజ్ అయినా పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది..
సినిమా పూర్తిచేసుకొని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా ఫస్ట్ లుక్ ను లవర్స్ డే సందర్భంగా ఈరోజు మేకర్స్ విడుదల చేశారు.. అజయ్, వంశీ ఏకశిరి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలీ, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు..
ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందనే టాక్ ను అందుకుంది.. యూత్ అంశాలతో పటు ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించినట్టు డైరెక్టర్ రాజు రాజేంద్రప్రసాద్ తెలిపారు.. ఇక సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని సమాచారం..