Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పేశారు. ఈ మేరకు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఈ సమావేశంలో రా కదలి రా సభలు, లోకేష్ శంఖారావం మీటింగ్ తో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Read Also: Botsa Satyanarayana: మా నైతికత మాకు వుంది.. ఒంటరి పోరాటమే..
ఎన్నికలకు అటు ఇటుగా కేవలం 56 రోజులే ఉందని పార్టీ నేతలు చర్చించగా.. పూర్తిగా ఎలక్షన్ మూడ్‌లోకి రావాలని చంద్రబాబు వారికి సూచించారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారంపై చర్చించినట్లు తెలిసింది. వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్‌లోకి వస్తున్న మాట చంద్రబాబు నిజమేనని చంద్రబాబు నిర్ధారించారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని.. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్‌కు నష్టం జరగదని టీడీపీ అధినేత పేర్కొన్నారు.