ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నమన్నారు. ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు అని ఆయన అన్నారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని…
పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. రకరకాల రంగుల్లో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.. అందుకే వయస్సు తో సంబంధం లేకుండా అందరూ తింటుంటారు.. అలాంటి పీచు మిఠాయి ఇక మీదట కనిపించదనే వార్త విని చాలా షాక్ అవుతున్నారు.. దీన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తుండటంతో దీన్ని నిషేధించినట్లు తెలుస్తుంది.. అస్సలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని…
2024లో అనేక గ్రహణాలు కనిపించనున్నాయి. ఈ సంవత్సరం చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం వంటి ఖగోళ సంఘటనలకు సాక్షిగా ఉంటుంది. చంద్రుడు భూమికి మధ్య వచ్చి సూర్యుని కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. కానీ సూర్యగ్రహణం సంభవించే ప్రదేశం భూమి మాత్రమే కాదు. ఈ రకమైన గ్రహణం సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలపై కూడా సంభవిస్తుంది.
నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్‌గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…
సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడన్నారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయ్యారు… ఆయన భాష మారుతుంది అని ఆశించామని కడియం శ్రీహరి అన్నారు. కానీ కేసీఆర్ ను అసభ్య పదజాలం…
జనసేనలో టికెట్ రాని నేతలంతా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని కేఏ పాల్ అన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముందు షర్మిలా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని తానే చెప్పానన్నారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలని ఇంగ్లీష్ ఫై మోజు ఉండాలి కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు వసంత పంచమి( శ్రీ పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్‌పేట లోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి తమ…
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు. చేయదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పని చేశాయీ, భవిష్యత్ లోనూ పని చేస్తాయి. కలిసి పని చేయమని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని, గతంలో పీసీసీ…