Kodali Nani: ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు అందరిని వెంటబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ ఉన్న ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మబ్బులో పెడదామని వెళ్ళాడని ఆరోపించారు. అక్కడ ఉన్నది అమిత్ షా, మోడీ కావడంతో వాళ్లిచ్చిన ఆఫర్ దెబ్బకు.. హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుంచి ఏపీకి రావడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు.
Read Also: Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
పవన్ హెలిప్యాడ్ అనుమతి అంశంపై కొడాలి నాని స్పందించారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో…. భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడని ఆయన విమర్శించారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో పవన్ చెప్పగలడన్నారు. మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది.. లేదా ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చన్నారు. భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి.. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడు గమనించుకోవాలని కొడాలి నాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!