MLA Maheshwar Reddy : బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు.. చేయదు కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు. చేయదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయీ, భవిష్యత్ లోనూ పని చేస్తాయి. కలిసి పని చేయమని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని, గతంలో పీసీసీ అధ్యక్షులుగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారన్నారు. సీఎం తో పాటు, మేడిగడ్డ పర్యటన పిక్నిక్ వెళ్ళి లంచ్ చేసి వచ్చారని, కాళేశ్వరం పర్యటన గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి పర్యటించారన్నారు మహేశ్వర్ రెడ్డి. కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే..48 గంటల్లో కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు మహేశ్వర్ రెడ్డి.
Also Read
అంతేకాకుండా.. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని, గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం తప్పులపై సీబీఐ ఎంక్వైరీ కోరడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటీ…? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలన్నారు మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు.. అలా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని, గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం తప్పులపై సీబీఐ ఎంక్వైరీ కోరడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటీ…? అని ఆయన అన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని, సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు.. అలా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు మహేశ్వర్ రెడ్డి. ప్రజల మభ్యపెట్టే మోసపూరిత బడ్జెట్ అని, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్నారు.
Seethakka Vs Kavitha: రాహుల్ యాత్ర బస్సు రేవంత్ వాడిందే.. కవితకు సీతక్క కౌంటర్
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!