ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. తేజ సజ్జా వంటి ఒక యంగ్ హీరో చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఊహించని పరిణామం. కేవలం కంటెంట్ ఆధారంగా హనుమాన్ భారీ వసూళ్లు రాబట్టింది. కాగా హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జై హనుమాన్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.. అయితే ఈ సినిమాలో హనుమాన్ హీరో గా కథ మొత్తం ఉంటుందని డైరెక్టర్ చెప్పారు.. ఇక ఆ పాత్ర కోసం ఒక స్టార్ హీరోను దించుతున్నట్లు చెబుతున్నారు..
హనుమాన్ లో ఫేస్ సరిగా రివీల్ చేయకపోయినప్పటికీ హనుమాన్ పాత్ర చేసింది రానా అని కథనాలు వెలువడ్డాయి. దీంతో జై హనుమాన్ హీరో రానా అని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ హీరోగా యష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట… భారీ బడ్జెట్ మూవీ కావడంతో యష్ ని లైన్లోకి తెస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.. కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది..