భారతీయ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడు ఇబ్బందులు పడతారో తెలియదు కాబట్టి... అందుకే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
మేడిగడ్డ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు.…
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ…
బ్రెజిల్ చాలా అందమైన దేశం. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడ ఇలాంటివి చాలానే ఉన్నాయి. బ్రెజిల్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రియో కార్నివాల్ ప్రారంభమైంది.
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది.. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10,…
వాలెంటైన్స్ డే రోజున ఒక డేట్‌కి వెళ్లాలనే ఆలోచన గురించి ఆలోచిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఈ రోజున, దాదాపు ప్రతి చోటా విపరీతమైన రద్దీగా ఉంటుంది. అక్కడ ఎవరైనా తిరుగుతూ, తీరికగా కూర్చుని మాట్లాడుకోలేరు. చాలా సార్లు రెస్టారెంట్లు మొదలైన వాటిలో కూర్చోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలనే ఆలోచన పాడవుతుంది.
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి #TSRTC శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. మేడారం మహా జాతర ఈ…
శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లే ముందు బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోందన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తెలంగాణ నదీ జలాలపై కేంద్రం ఆక్రమణలకు పాల్పడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే నదుల నిర్వహణను…
జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన 30కి పైగా పిటిషన్లను పాకిస్థాన్ కోర్టు మంగళవారం తిరస్కరించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్‌తో సహా పీఎంఎల్-ఎన్ అగ్రనేతల విజయంపై పిటిషన్ సవాల్ చేసింది.