జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైన అంటే అసలు ఊరుకోడు.. ఇప్పుడు తాను పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వార్తలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ విశ్వాసం ప్రకటించాడు. అదే సమయంలో మంత్రి రోజాతో విభేదాలపై ఇటీవల క్లారీటి ఇచ్చారు..
ఏపీలో ఎన్నికల హీట్ కూడా రెండు నెలల ముందే మొదలైంది.. జబర్దస్త్ మాజీ కమెడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. జనసేన సానుభూతి పరుడైన ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి.. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో హైపర్ ఆది పాల్గొన్నాడు. సభల్లో రాజకీయ ప్రసంగాలతో హోరెత్తించాడు.. ఎక్కడ ఏం జరిగినా తాను కూడా ముందుంటున్నాడు.. దీంతో ఆయన ఫ్యాన్స్ ఎమ్మెల్యే గా పోటి చేయబోతున్నాడని ప్రచారం కూడా చేస్తున్నారు..
ఇటీవల ఓ ఛానెల్ లో మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాత్రమే.. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు మద్దతు తెలపడం లేదు.ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఆయన్ని గెలిపించడం కోసం గెలుస్తాను. ఈసారి కూడా జనసేన తరపున నేను క్యాంపైన్ చేయడానికి వెళతానని తేల్చి చెప్పేసాడు.. అయితే జనసేన ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉంది. జనసేన పార్టీకి టీడీపీ ఇచ్చే కొద్ది సీట్లల్లో హైపర్ ఆదికి ఒకటి ఇవ్వడం అసాధ్యం.. అతనికి నిజంగానే టిక్కెట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేసాడన్నది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక ఆది కేరీర్ విషయానికొస్తే.. చేతినిండా సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు..