బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల నోట్లో మట్టికొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా స్వార్ధరాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…
నైట్ ఫ్రాంక్ ఇండియా యొక్క తాజా ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024’ నివేదిక ప్రకారం, హై స్ట్రీట్ రిటైల్‌లో హైదరాబాదు భారతదేశంలోని అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలుస్తుంది, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) మరియు బెంగళూరు తర్వాత చాలా దగ్గరగా ఉంది. మొదటి ఎనిమిది నగరాల్లో ఉన్న 82 శాతం స్టోర్లలో 15 శాతం హైదరాబాద్‌దేనని నివేదిక హైలైట్ చేసింది. ఈ నివేదిక హైదరాబాద్‌లో విస్తరించి ఉన్న ఐదు ప్రముఖ హై స్ట్రీట్‌లను గుర్తించి, దాని…
ఈ మధ్యకాలంలో సినిమా హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు ప్రేమ వివాహాలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఆ ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎంత కామన్ అయిందో చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ముందుగా వారు విడిపోతున్నారనే విషయం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కొంత క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మరో జంట విడిపోబోతున్నారని ప్రచారం మొదలైంది. ఆ జంట ఇంకెవరో కాదు రణవీర్…
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌లు ఓర్చుకోలేక పోతున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు దానిని అడ్డుకున్నాయన్నారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో వేసామన్నారు..రైతు భరోసా ను ఆపాలని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశాయనీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల వరకు రైతు భరోసా…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు దీంతో కొంత ఉపశమనం లభించింది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ధాన్యం తడిసిముద్దయింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల…
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తా నగర్ లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, మాజీమంత్రి కాకతీయ వంశస్థులు కమల్ మంజు దియా కాకతీయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా డప్పు వాయించారు వినోద్ రావు, పొంగులేటి…
చైనాలోని నైరుతి ప్రావిన్స్ యునాన్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన కత్తి దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. ఆ దేశ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.