హైదరాబాద్‌లోనే కాద యావత్తు దేశంలో టీ20 క్రికెట్ మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే క్రికెట్ ప్రియుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. ట్యాంక్ బంద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. 56.1 అడుగుల పొడవు, 9 టన్నుల బరువున్న ఈ క్రికెట్ బ్యాట్ ను అజారుద్దీన్ ట్యాంక్ బండ్‌పై మాజీ క్రికెటర్ అజారుద్దీన్, తెలంగాణ ఐటీ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
చైనా ప్రపంచ శక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోందని త్రిధళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా-పాక్ సంబంధంపై మాట్లాడిన బిపిన్.. ఆ దేశాల మధ్య ఉన్న సంబంధం భారత్‌కు వ్యతిరేకం అని అన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమైందని, ఫలితంగా ఆ దేశాలపై పట్టు సాధించేందుకు ఎత్తుగడలు వేస్తోందని అన్నారు. దక్షిణాసియాలో చైనా చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. చైనా బలమైన దేశమైనా,…
కరోనా మహామ్మరిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ను తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 15వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. నవంబర్ 1నుంచి సినిమా థియేటర్లలో 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. దీనితో పాటు నవంబర్ 1 నుంచి 1-8 తరగతులు రోటేషన్ విధానంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే…
హర్యానా ప్రభుత్వం శనివారం నాడు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు సాధారణమే అయినా తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన బదిలీ కావడం తన 29 ఏళ్ల సర్వీసులో ఇది 54వ సారి కావడం విశేషం. ఆయన పేరు అశోక్ ఖేంకా. ఆయన హర్యానా ప్రభుత్వ ఆర్కివ్స్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్టుమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. Read Also: పిల్లలకు హోంవర్క్…
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్,…
రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ…
కరోనా కారణంగా గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. వారు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఒక…
వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ బీజీగా ఉండే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొండామురళికి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం కొండా అనే టైటిల్ తో కొండా మురళిపై ఆర్జీవీ సినిమా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్ కౌంటర్ చేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకు…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు.…