కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.
పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం బద్వేల్ నుంచి రోడ్డు మార్గాన పోరుమామిళ్లకు చేరుకుంటారు. పోరుమామిళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, బస్టాండ్ కూడలిలో కేంద్ర మంత్రి మురుగన్ ప్రసంగించనున్నారు. సాయంత్రం రోడ్డు మార్గాన కడపకు చేరుకోని అక్కడి నుంచి చెన్నైకి కేంద్ర మంత్రి బయలుదేరనున్నారు.