ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని…
రోజురోజుకు ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధ తారస్థాయి చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబుది కొంగ జపం అంటున్న మంత్రి పేర్ని నానికి పచ్చ కామెర్లు వచ్చాయి. చంద్రబాబును విమర్శిస్తున్న పేర్ని నాని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. జగన్‌ది బలుపు కాదు వాపు. స్థానిక ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ముచ్చెమటలు పట్టిస్తాం. ఇప్పుడు ఎన్నికలు పెడితే…
అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుంది. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా మరణించిన 40 రోజుల లోపు…
రాజేంద్రనగర్‌లోని హైదర్ గూడకు చెందిన అనీష్ మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు అపార్ట్మెంట్ సెల్లార్‌కు వెళ్లిన అనీష్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని అనీష్ తల్లిదండ్రులు సాయంత్రం గుర్తించి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముందుగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్లు భావించిన పోలీసులు అది నిజం కాకపోవడంతో హైదర్ గూడ పరిసరాలను తనిఖీ చేశారు. దీంతో…
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో…
రాజేంద్రనగర్‌లో 7 సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న అనీష్ అనే బాలుడు అపార్ట్మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సాయంత్రం గుర్తించి హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి బాలుడి…
జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్నెట్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని…
రెండు సార్లు ఒలింపిక్స్ పతకం విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌కు సంబంధించి 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-16, 12-21, 21-15 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై పీవీ సింధు విజయకేతనం ఎగురవేసింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్. మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొంటున్న…