కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్‌జౌ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా…
టీఆర్ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని, దళితులకు…
శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా రేపటి నుంచి రేషన్ షాపులకు బంద్‌కు పిలునిచ్చిన రేషన్ డీలర్లు వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ.. ప్రభుత్వం స్పందించేంతవరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కమిషన్ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదన్నారు. వాటితో పాటు గోనె సంచుల బకాయిలు చెల్లించడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ధర్నాలు నిర్వహిస్తామని…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి ఫోన్‌లు ట్యాప్ చేయట్లేదని.. ఫోన్ ట్యాపింగ్‌లపై రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖలో గ్రూపులు లేవని, అసత్య ప్రచారంలో మమల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక…
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన…
టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్లోని హైటెక్స్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ…